LearningApps – ఇంటరాక్టివ్ టెస్ట్ ఆప్స్ ని సులభంగా తయారు చేసుకోండి ఇలా.. (Learning Apps Part 1)

టీచర్ లకు ఉపయోగపడే టూల్స్ మరియు వెబ్సైట్ ల ను గురించి తెలియజేసే ప్రయత్నం లో మరొక అద్బుతమైన వెబ్ టూల్ ని ఈరోజు పరిచయం చేయబోతున్నాను.
ఇంటరాక్టివ్ టెస్ట్ ఆప్స్ ని చాలా సులభంగా సృష్టించేందుకు ఒక అద్భుతమైన వెబ్సైట్ మనకుంది అదే
LearningApps.org
ఈ ఆర్టికల్ లో మనం LearningApps.org వెబ్సైట్ లో ఏం చేయవచ్చు, అప్ప్స్ ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయం చూద్దాం.
పూర్తి వీడియో పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
LearningApps.org వెబ్సైట్ లో మనం దాదాపు 22 రకాల ఇంటరాక్టివ్ అప్ప్స్ ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
ఇందులో మొత్తం 22 రకాల ఆప్స్ ఉన్నాయి, అవి
SLNO | App | Purpose |
1 | Matching Pairs | ఒక పదాన్ని, లేదా దాని ఉచ్ఛారణ ని, లేదా చిత్రాన్ని డానికి సరిపోయే దానితో జత పరచడం |
2 | Group Assignments | ఇచ్చిన అంశం ఏ వర్గం లోకి వస్తుందో చూపాలి |
3 | Number Line | ఇచ్చిన సంఖ్య ను సంఖ్యా రేఖ పై సరైన స్థానం లో ఉంచడం |
4 | Simple Order | ఇచ్చిన పదాలను లేదా వాఖ్యాలను సరైన క్రమం లో అమర్చడం |
5 | Freetext input | స్వంత జవాబులు ఇవ్వడం |
6 | Matching Pairs on Images (Map Pointing) | ఇచ్చిన చిత్రం లో సరైన పదాలను లేదా వాఖ్యలను జత పరచడం
మ్యాప్ పాయింటింగ్ కి ఇది ఉపయోగపడుతుంది |
7 | Multiple-Choice Quiz | బహుళైచ్చిక ప్రశ్నలకు జవాబులివ్వడం |
8 | Cloze text ( Fill in the Blanks) | ఖాళీలను ఇచ్చిన పదాలతో నింపడం |
9 | App Matrix | రక రకాల ఆప్స్ ని ఒకే దగ్గర అందించడం |
10 | Audio/ Vido with Notices | ఆడియో లేదా వీడియో ఇచ్చి అందులో మధ్య మధ్య లో ప్రశ్నల ఆప్స్ ని జత చేసి ఇవ్వడం |
11 | The Millionaire Game | మీలో ఎవ్వరూ కోటీశ్వరుడు లాంటి గేమ్ |
12 | Group-Puzzle | ఇది జిగ్ జాగ్ పజిల్ లాంటిది ఇందులో ఉన్న చిత్రాన్ని కనిపించేలా చేయడానికి పదాలను సరైన గ్రూప్ లో ఉంచడం |
13 | Crossword | పదాలను అడ్డు నిలువు క్రమం లో సరైన స్థానం లో నింపడం |
14 | Word grid (Word Search ) | ఇచ్చిన అక్షరాల గ్రిడ్ లో వాక్యాలను వెదకడం |
15 | Where is What | చిత్రం లో వివిధ ప్రదేశాలను గుర్తించడం లాంటిది, ఇది ఒంటరిగా లేదా కంప్యూటర్ తో ఒక గేమ్ లా ఆడవచ్చు |
16 | Guess the Word | పదాన్ని ఊహించడం |
17 | Horse Race | ప్రశ్నలకు జవాబిస్తూ గుర్రపు స్వారీ లో పాల్గొనడం |
18 | Pairing Game | అటుగా తిప్పి ఉన్న చిత్రాలను జత చేయడం, ఇది ఒక మెమొరీ గేమ్ లాంటిది |
19 | Guess | ఇచ్చిన భాగం లో సంఖ్య ను ఊహించడం |
20 | Matching Matrix | ఇచ్చిన పదాలను లేదా చిత్రాలను సరైన దాని క్రింద పెట్టడం |
21 | Fill Table | సరైన పదాలతో టేబుల్ నింపడం |
22 | Quiz with text input | విన్న వాఖ్యాన్ని టైప్ చేయడం |
ఈ వెబ్సైట్ లో ఎలాంటి లాగిన్ అవసరం లేకుండానే ఆప్స్ ని తయారు చేసుకుని మన విద్యార్థులకు పంపవచ్చు,
అయితే లాగిన్ అయినట్లైతే
- మనం తయారు చేసుకున్న ఆప్స్ ని మళ్ళీ కావాలంటే మార్చుకోవడం,
- వాటి ఫలితాలు ఎలా వచ్చాయో చూసుకోవడం,
- తరగతులను తయారు చేసుకుని వాటిలో విద్యార్థులను చేర్చుకోవడం
- తరగతి లోని అందరు విద్యార్థులకు ఒకే సారి మనం తయారు చేసిన ఆప్ ని పంపడం
- My Apps లో చేర్చుకున్న ఆప్స్ ని ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసుకోడానికి ఇలా అనేక ఫీచర్స్ లభిస్తాయి.
లాగిన్ కోసం ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు
కేవలం మన మెయిల్ ఐడి, యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఇస్తే సరిపోతుంది
లాగిన్ చేయాలంటే ముందు రిజిష్టర్ చేసుకోవాలి అందుకోసం వెబ్సైట్ లో లాగిన్ బటన్ క్లిక్ చేసి వచ్చే విండోలో మన వివరాలు ఇచ్చి Register account బటన్ ను క్లిక్ చేయాలి
రిజిస్టర్ చేసుకున్నాక మన యూజర్ నేమ్ లేదా ఈ మెయిల్ మరియు మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ తో లాగిన్ అయి మన ఆప్స్ ని తయారు చేసుకోవచ్చు.
ఉదాహరణము మనం ఒక ఆప్ తయారు ఎలా చేయాలో చూద్దాం
ఆప్ తయారు చేయాలంటే, ఆల్రెడీ ఉన్నటు వంటి ఆప్ ని తీసుకుని దాని నుండి ఆప్ తయారు చేసుకోవచ్చు, లేదా కొత్త గామనంఏ ఆప్ తయారు చేసుకోవచ్చు.
ఆల్రెడీ ఉన్నటు వంటి ఆప్ నుండి మన ఆప్ తయారు చేసుకోడానికి :
ముందుగా మెయిన్ పేజీ లో ఏదైనా ఒక ఆప్ ని వెదకడం (Search) ద్వారా గాని లేదా కేటగిరీ లలో ఎంచుకోవడం (Browse) ద్వారాగాని లేదా Image, Audio, Video ఉండే వి గా లేదా వివిధ స్థాయి లకు కావాల్సిన విగా ఎంచుకుని
అది క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది
ఇలా ఓపెన్ అయిన ఆప్ క్రింద ఎడమవైపున Create Similar App అనే బటన్ ఉంటుంది అది క్లిక్ చేసి డైరెక్ట్ గా అలాంటి ఆప్ నే తయారు చేసుకోవచ్చు
లేదా రెండవ ది తీసుకుంటే ఈ ఆప్ యొక్క కాపీ ఒకటి తయారు అవుతుంది
ఇంకా మూడవది ఆప్షన్ లో ఈ ఆప్ లాగే ఉండే ఖాళీ టెంప్లేట్ తీసుకుని తయారు చేసుకోవచ్చు
మనం మొదటి ఆప్షన్ తీసుకుని చూద్దాం
ఇప్పుడు ఆప్ ఇలా ఓపెన్ అవుతుంది
ఇందులో మన ఆప్ కి ఇవ్వాలనుకున్న పేరు App Title బాక్స్ లో ఇచ్చి, ఈ ఆప్ ఏమిటనే వివరణ Task Desciption బాక్స్ లో ఇవ్వాలి
ఆ తర్వాత ఆల్రెడీ ఉన్న జాతలలో (Pairs లో ) మనకు కావాల్సిన మార్పులు ఆయా బాటన్స్ క్లిక్ చేసి చేసుకోవాలి
ఏదైనా Pair తీసేయాలంటే దాని ముందున్న Delete బటన్ క్లిక్ చేయాలి
అలాటె image మార్చాలంటే image పై క్లిక్ చేయడం ద్వారా లేదా text to speech మార్చాలంటే అక్కడ text టైప్ చేయడం ద్వారా చేసుకోవచ్చు
ఇవన్నీ మార్పులు చేసుకున్నాక,
విద్యార్థి బాగా చేస్తే మెచ్చుకోడానికి ఏం చెప్పాలో Feedback బాక్స్ లో రాయాలి
విద్యార్థికి ఏదైనా Hint ఇవ్వాలనుకుంటే Help బాక్స్ లో టైప్ చేయాలి
ఇవి చేసిన తర్వాత Save బటన్ క్లిక్ చేస్తే ఆప్ మన అకౌంట్ లో సేవ్ అవుతుంది.
విద్యార్థులతో ఈ ఆప్ ని షేర్ చేయడానికి
ఈ విండోలో కుడివైపున క్రింద బాగాన ఉన్న లింక్స్ కాపీ చేసుకుని పంపవచ్చు,
QR Code పై క్లిక్ చేసి దాన్ని స్కాన్ చేయడం ద్వారా కూడా ఆప్ ని షేర్ చేయవచ్చు
మనం ఆల్రెడీ ఉన్న ఆప్ నుండి ఎలా తయారు చేయాలో చూసాము, ఇప్పుడు
మన స్వంత ఆప్ తయారు చేసుకోడానికి :
మెయిన్ పేజీ లో పై భాగాన ఉన్న Create App బటన్ క్లిక్ చేయాలి
ఇది క్లిక్ చేసిన తర్వాత ఎలాంటి ఆప్ తయారు చేయాలనుకుంటున్నామో దాని టెంప్లేట్ ని ఎంచుకోవాలి
ఉదాహరణ కు ఇక్కనడ నేను Pairing Game తీసుకున్నాను
ఇది తీసుకోవానే ఈ క్రింది విధంగా వస్తుంది
ఇందులో ఇచ్చిన ఉదాహరణలు చూసుకోవచ్చు, ఆ తర్వాత Create new App అనే బటన్ క్లిక్ చేయాలి
ఇందులో మన ఆప్ కి ఇవ్వాలనుకున్న పేరు App Title బాక్స్ లో ఇచ్చి, ఈ ఆప్ ఏమిటనే వివరణ Task Desciption బాక్స్ లో ఇవ్వాలి
ఆ తర్వాత Settings లో Medium, Large, Small Card సైజ్ లలో ఒకటి ఎంచుకోవాలి
ఇప్పుడు Pairs లో Pair 1 అని ఉన్నదానికి ఎదురుగా Text, Image, Text to Speech లలో ఏదైనా క్లిక్ చేసి దాన్ని ఇవ్వాలి.
Image ఇవ్వాలనుకున్నప్పుడు వచ్చే విండో లో 3 రకాలుగా image ఇవ్వవచ్చు
మొదటిది : Search Image దీని ద్వారా ఇక్కడే CC0 images ని వెదికి ఇందులోకి చేర్చుకోవచ్చు,
రెండవది : Use Image దీని ద్వారా వేరే వెబ్సైట్
లో ఉన్న లేదా imgur లాంటి హోస్ట్ లో ఉన్న ఇమేజ్ లింకు ఇవ్వవచ్చు
ఇక మూడవది : Drag and Drop మన కంప్యూటర్ లో ఉన్న ఇమేజ్ ని ఇందులో వేయవచ్చు
ఇలా ఇమేజ్ మార్చుకుని
Text to Speech ఇవ్వాలనుకుంటే జస్ట్ టైప్
చేస్తే సరిపోతుంది
ఇలా ఒక ప్రశ్న పూర్తి అయిన తర్వాత మరొక ప్రశ్న ఇవ్వడానికి Add another element అనే బటన్ క్లిక్ చేయాలి
ఈ విధంగా అన్నీ ప్రశ్నలు ఇచ్చిన తర్వాత,
Hide matched Cards ? దగ్గర ఒక వేళ విద్యార్థి జవాబు కరెక్ట్ గా ఇస్తే ఆ జత ను దాచేయాలంటే Hide Cards అని వద్దనుకుంటే cards stay visible అనే ఆప్షన్ తీసుకోవాలి
ఆ తర్వాత Feedback , Hint లు ఇచ్చి Finish editing and show preview బటన్ క్లిక్ చేయాలి
ఆ తర్వాత Save App బటన్ క్లిక్ చేయాలి ఒక వేళ ఏమైనా మార్పులు చేయాలనుకుంటే Edit Again అనే బటన్ క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు
ఈ విధంగా సేవ్ అయిన ఆప్స్ మన అకౌంటు లో My Apps లోకి వస్తాయి, అక్కడి నుండి మనం విద్యార్థులకు షేర్ చేయవచ్చు,
అయితే ఒకే సారి తరగతి విద్యార్థులందరికీ షేర్ చేసి, వారి రిజల్ట్ ని చూడాలనుకునగే Classrooms మరియు Student Accounts తయారు చేసుకోవాలి
అవి ఎలా చేసుకోవాలో తర్వాతి భాగం లో చూద్దాం
అదే విధంగా వివిధ రకాల ఆప్స్ ఎలా చేయాలో కూడా తర్వాతి భాగాలలో చూద్దాం.
అప్పటి వరకు ఈ ఆర్టికల్ వీడియో చూడండి
Recent Comments