LearningApps -How to type Mathematical Equations & Expressions.. (Learning Apps Part 3)

సులభంగా ఆప్స్ ని తయారు చేసుకునే LearningApps.Org ని గురించి పార్ట్ -1 లో చెప్పుకున్నాము అది చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి
LearingApps ఉపయోగించి Map Pointing App ఎలా తయారు చేసుకోవాలో పార్ట్ -2 లో చెప్పుకున్నాము అది చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అయితే, వివిధ రకాల ఆప్స్ ని తయారు చేస్తున్నప్పుడు, ఏ సందర్భంలోనైనా మనకు గణిత సమీకరణాలు కానీ చిహ్నాలు కానీ (Mathematical Equations & Expressions) టైప్ చేయాలంటే ఎలా అనేది ఈ భాగం లో నేర్చుకుందాం.
గణిత సూత్రాలు గాని సమీకరణాలు గాని వచ్చినప్పుడు ఉదాహరణకు
x2 లేదా x2 రాయాల్సి వచ్చినప్పుడు, అలాగే భిన్నాలు (fractions) Square Root,
అదే విధంగా వివిధ రకాల చిహ్నాల తో పాటు రసాయన సమీకరణాలు రాయాలంటే,
అదే విధంగా టెక్స్ట్ ని కలర్ లో చూపాలంటే, ఎలా?
ఎందుకంటే మనం వర్డ్ నుండి గాని ఇతర టెక్స్ట్ ఎడిటర్ లనుండి గాని కాపీ చేసిన సమీకరణాలు LearningApps లో పేస్ట్ చేయగానే వాటి ఫార్మాటింగ్ పోతుంది.
అందుకే చాలా మంది ఇలాంటి సమీకరణాలు చిహ్నాలు వాదాలనుకున్నప్పుడు టెక్స్ట్ కి బదులు ఇమేజ్ వాడుతున్నారు .
అలా కాకుండా టెక్స్ట్ వాడాలంటే,
ముందుగా టెక్స్ట్ బాక్స్ లో ఒక ప్రత్యేకమైన పద్దతిలో ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది,
ఇలాంటి సమీకరణాలు చిహ్నాలు చూపాలనుకున్న ప్రతి సారి వాటి ముందు తర్వాత $$ డబుల్ డాలర్ సింబల్స్ వాడాలి,
ఉదాహరణ కు
x2 రాయాలంటే
టెక్స్ట్ బాక్స్ లో $$ x _2$$ అని రాయాలి
ఇక్కడ x తర్వాత 2 ను కింద చూపించడానికి under score _ వాడాము
అలాగే ఇంకొక ఉదాహరణ చూద్దాం
x2 రాయాలంటే
టెక్స్ట్ బాక్స్ లో $$ x ^2$$ అని రాయాలి
ఇక్కడ x తర్వాత 2 ను పైన చూపించడానికి caret ^ వాడాము
5 ½ ను చూపాలంటే
టెక్స్ట్ బాక్స్ లో $$ 5 \frac {1}{2} $$ అని రాయాలి
ఇక్కడ ½ చూపించడానికి \frac వాడాము
అలాగే వివిధ రకాల సింబల్స్ మరియు గణిత సమీకరణాలు ఇలా వాడాలి
Subscript x2 | $$x_2$$ |
SuperScript x2 | $$4x^2$$ |
Right Arrow → | $$\rightarrow$$ |
Left Arrow ← | $$\leftarrow $$ |
Fractions
Small ⅖ |
5$$\frac{5}{2}$$ |
Fractions
Big ⅖ |
5$$\dfrac {1}{4}$$ |
Sum of ∑ | $$\sum{x}$$ |
Pi ∏ | $$\pi$$$$ |
Square | $$\square $$ |
Triangle | $$\triangle$$ |
α κ ψ z ∆ Θ | $$ \alpha \kappa \psi \digamma \Delta \Theta$$ |
Square Root | $$ \sqrt{abc} \sqrt[n]{abc} $$ |
ఇంకా కొన్ని ఉదాహరణలు తర్వాత భాగం లో చూద్దాం
ఈ ఆర్టికల్ వీడియో చూడండి
Recent Comments