LearningApps -మ్యాప్ పాయింటింగ్ ఆప్ తయారు చేయడం .. (Learning Apps Part 2)

April 28, 2021 0 Comments

సులభంగా ఆప్స్ ని తయారు చేసుకునే LearningApps.Org ని గురించి పార్ట్ -1 లో చెప్పుకున్నాము అది చూడడానికి  ఇక్కడ క్లిక్ చేయండి

ఈ భాగం లో  LearingApps ఉపయోగించి Map Pointing App ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం

ఈ భాగం వీడియో కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ముందుగా Create App క్లిక్ చేయాలి

తర్వాత వచ్చే విండో లో  22 రకాల ఇంటరాక్టివ్ అప్ప్స్ టెంప్లేట్స్ కనిపిస్తాయి 

అందులో Matching Pairs on Images అనే టెంప్లేట్ పై క్లిక్ చేయాలి

ఇప్పుడు వచ్చే విండో లో Examples తీసుకోవచ్చు  లేదంటే Create new App బటన్ ని క్లిక్ చేయాలి

 

ఇప్పుడు App Title మరియు App description ఇవ్వాలి

ఆ తర్వాత Background Image (అంటే మన మ్యాప్ ఇమేజ్ ) ఇవ్వడానికి  Select Image బటన్ క్లిక్ చేసి ఇమేజ్ తీసుకోవాలి

ఇందులో వచ్చే 3 ఆప్షన్ లలో Search ద్వారా క్రియేటివ్ కామన్స్ ఇమేజెస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు

ఇందులో మనకు కావాల్సిన మ్యాప్ వెదికి , దాన్ని క్లిక్ చేసి

use this అనే బటన్ క్లిక్ చేయాలి

ఇప్పుడు Marks on the Images  లో మన మ్యాప్ పై ఏ ఏ ప్రదేశాలలో Point చేయాలో అక్కడ మార్కర్

పెట్టడానికి Place marker అనే బటన్ క్లిక్ చేసి

కావాల్సిన కలర్ మార్కర్ తీసుకుని దాన్ని కావాల్సిన ప్రదేశం లో పెట్టి Save బటన్ క్లిక్ చేయాలి

ఇప్పుడు ఆ పాయింట్ కి ఇవ్వాల్సిన జవాబు (Answer) Text గా గానీ, Image  గా గానీ, Text to Speech గా గానీ,Audio గా గానీ, Video  గా గానీ, ఇవ్వవచ్చు

మనం Text ఇవ్వడానికి Text అనే బటన్ కీ క్లిక్ చేసి అక్కడ జవాబు ఇవ్వాలి

ఇప్పుడు మరొక పాయింట్ పెట్టడానికి, 

Place marker అనే బటన్ క్లిక్ చేసి  

కావాల్సిన కలర్ మార్కర్ తీసుకుని దాన్ని కావాల్సిన ప్రదేశం లో పెట్టి Save బటన్ క్లిక్ చేయాలి

ఆ తర్వాత జవాబుగా Text గా గానీ, Image  గా గానీ, Text to Speech గా గానీ,Audio గా గానీ, Video  గా గానీ, ఇవ్వవచ్చు

 

ఇలా అన్నీ పాయింట్స్ ఇవ్వడం పూర్తి  చేసుకున్నాక,

 

విద్యార్థి బాగా చేస్తే మెచ్చుకోడానికి ఏం చెప్పాలో Feedback బాక్స్ లో రాయాలి

విద్యార్థికి ఏదైనా Hint ఇవ్వాలనుకుంటే Help బాక్స్ లో టైప్ చేయాలి

Finsh editing and show preview  బటన్ క్లిక్ చేయాలి

ఇప్పుడు వచ్చే విండో లో Save App బటన్ క్లిక్ చేయాలి

ఇప్పుడు  ఆప్ మన అకౌంట్ లో సేవ్ అవుతుంది.

 

విద్యార్థులతో ఈ ఆప్ ని షేర్ చేయడానికి

ఈ విండోలో కుడివైపున క్రింద బాగాన ఉన్న లింక్స్ కాపీ చేసుకుని పంపవచ్చు,

QR Code పై క్లిక్ చేసి దాన్ని స్కాన్ చేయడం ద్వారా కూడా ఆప్ ని షేర్ చేయవచ్చు

 

ఈ ఆర్టికల్ వీడియో చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *